![]() |
![]() |
.webp)
టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో మెరిసిపోయాడు. ఇక శోభా శెట్టితో కలిసి ఆడిపాడారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కూడా వీళ్ళ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతోంది. ఇక తేజ అంటే చాలు ఫుడ్ వ్లాగ్స్ కి పెట్టింది పేరు. కొత్త మూవీస్ రిలీజ్ ఐతే చాలు ఆ మూవీతో పాటు డిఫరెంట్ ఫుడ్స్ తింటూ, తినిపిస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తాడు తేజా. అలాగే బిగ్ బాస్ పేరు వరల్డ్ వైడ్ ఫుల్ ఫేమస్ ఐపోయింది.
.webp)
ఈ పేరుని ఎవరికి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైములో బిగ్ బాస్ బిర్యానీ అండ్ పులావ్స్ పేరుతో ఒక మండి స్టార్ట్ అయ్యింది. దీనికి టేస్టీ తేజా రిబ్బన్ కట్ చేసి షాప్ ని ఓపెన్ చేసాడు. షాప్ ఓపెనింగ్ కి వచ్చిన వాళ్లంతా కూడా తేజతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. రిబ్బన్ కట్ చేసాక లోపలి ఎంట్రీ ఇచ్చాడు తేజ. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్ ని చూసి షాకయ్యాడు. ఆ బ్యానర్ లో సల్మాన్ఖాన్, నాగార్జున, తేజ, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫొటోస్ కనిపించాయి. ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు జబర్దస్త్ లో కమెడియన్ గా నటించాడు. ఐతే ఈరోజు తేజ ఇలా ఒక సెలబ్రిటీ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే తనసలు ప్రజలకు తెలిసేవాడినే కాదన్నారు తేజ. ఇటు బుల్లితెరతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో 200కి పైగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఐతే జబర్దస్త్ లో కనిపించినా, బిగ్ బాస్ లో కనిపించినా ఫ్యూచర్ చాల బ్రైట్ గా ఉంటుంది అనడానికి చాలా మంది ఉదాహరణులుగా ఉన్నారు.
![]() |
![]() |